ENGLISH | TELUGU  
Home  » TV News

Illu illalu pillalu : నర్మద కోసం నడిపోడు తీసుకున్న పట్టీలు.. రామరాజుకి తెలిసేనా!

on Nov 15, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -04 లొ.....రామరాజు పెళ్లి రోజు సందర్భంగా ఊళ్ళో వాళ్లకు భోజనాలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తాడు. అదే రోజు భద్రవతి పుట్టినరోజు.. రామరాజు చేసే పెళ్లి రోజు వేడుకలకి ఊళ్ళో వాళ్లు వెళ్ళకూడదని తన ఇంటికి వచ్చిన వారందరికి మాంసం, మందు ఆశ చూపించి వెళ్లకుండా భద్రవతి సేనాపతి లు ఆపుతారు.

ఆ తర్వాత భద్రవతికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన మహిళలకి రిటర్న్ గిఫ్ట్ లుగా చీరలు అంటు వాళ్ళని వెళ్లకుండా ఆపుతారు. ఇక రామరాజు భోజనాల దగ్గరికి ఎవరు రాకపోవడంతో నిరుత్సాహంతో ఇంటికి తిరిగివస్తారు. అప్పుడే భద్రవతి ఇంటినుండి మందు తాగి బయటకు వస్తు.. మేమ్ ఇక్కడ మందు, మాంసం తిన్నాం ఇక గుడికి ఎలా వస్తామని రాలేదని వాళ్ళు అనగానే.. రామరాజుకి అర్థం అవుతుంది. ఇలా రాకుండా చెయ్యడానికి సిగ్గు లేదు అంటూ భద్రవతిని రామరాజు తిడతాడు. భద్రవతి ప్రతిసారీ అనాథ అని అంటుంటే.. నేను అనాథ కాదు నాకు ఇల్లు, ఇల్లాలు, పిల్లలు ఉన్నారని రామరాజు చెప్పగానే.. నీ ఇంటి పేరు ఏంటి? తండ్రి పేరు ఏంటని భద్రవతి అడుగగా.. రామరాజు సైలెంట్ అవుతాడు. నీకు నీ కుటుంబంలోకి కలహాల్ పెట్టేవాళ్ళు వస్తారని భద్రవతి అనగానే.. నేను ఎవరికి అన్యాయం చెయ్యలేదని రామరాజు అంటాడు.

ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం వేదవతి పూజ అందరిని పంపిస్తుంది. చిన్నోడు కాలేజీ ఫీజు అడిగాడు. దాంతో రైస్ మిల్ కి వెళ్లి అడుగు అని వేదవతి అనగానే.. చిన్నోడు వెళ్తాడు. కాలేజీ పీజు అడగంతో నీకు కష్టం విలువ తెలియాలని బస్తాలు మొయి అనగానే చిన్నోడు మోస్తాడు. అప్పుడే భద్రవతి మేన కోడలు తనని ఫోటో తీసి కాలేజీ గ్రూప్ లో పెడుతుంది. ఆ తర్వాత నడిపోని ఫోన్ కి నర్మద అనే అమ్మాయి ఫోన్ చేస్తుంది. అది చూసి నర్మదా ఎవరు అని రామరాజు అడుగుతాడు. ఆ తర్వాత కాసేపు అటపట్టిస్తుంది. తరువాయి భాగంలో నడిపోడు రామరాజుకి తెలియకుండా డబ్బులు తీసుకొని తన లవర్ నర్మదకి పట్టిలు తీసుకుంటాడు. డబ్బులు చిన్నోడు తీసాడని రామరాజు చిన్నడిని కొడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.